స్కూల్‌లో హిందీ తరగతి గుర్తొచ్చింది..
ABN , First Publish Date - 2020-05-13T07:32:36+05:30 IST
లాక్‌డౌన్‌లో నాలుగో దశకు భారత్ చేరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి 8గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన హిందీ పదాలు నెట్టింట విమర్శలకు...

న్యూఢిల్లీ, మే 12: లాక్‌డౌన్‌లో నాలుగో దశకు భారత్ చేరుకుంటున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి 8గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన హిందీ పదాలు నెట్టింట విమర్శలకు గురయ్యాయి. ఆయన వాడిన చాలా పదాలు హిందీ భాష మాట్లాడేవారికి సైతం కఠినంగా, ఉచ్ఛారణకు కష్టంగా ఉన్నాయని కొంతమంది అంటే.. తమ స్కూల్‌లో హిందీ తరగతులు గుర్తొచ్చాయంటూ మరికొంతమంది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ట్విటర్‌లో ఆయన ప్రసంగం పట్ల మీమ్స్ ట్రెండ్ అయ్యాయి.