సోమవారం మధ్యాహ్నం సీఎంలతో మరోసారి చర్చించనున్న మోదీ

ABN , First Publish Date - 2020-05-10T20:47:54+05:30 IST

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌-3 కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంలతో ఐదోసారి

సోమవారం మధ్యాహ్నం సీఎంలతో మరోసారి చర్చించనున్న మోదీ

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌-3 కొనసాగుతున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. లాక్‌డౌన్ అమలుపై చర్చిస్తారు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరుపుతారు. ఈ నెల 17న లాక్‌డౌన్-3 ముగియనున్న తరుణంలో మోదీ సీఎంలతో జరిపే వీడియో కాన్ఫరెన్స్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. 


దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 62,939 మందికి కరోనా సోకింది. 19,358 మంది కోలుకున్నారు. 2, 109 మంది చనిపోయారు. దేశంలో రికవరీ రేటు 30.75 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మహారాష్ట్రలో కరోనా కేసులు 20, 228కి చేరాయి. గుజరాత్‌లో 7,796, ఢిల్లీలో 6,542 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ తరుణంలో ఈ మూడు రాష్ట్రాల సీఎంలు మరింత పగడ్బంధీగా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించే అవకాశం ఉంది. అవసరమైతే కేంద్ర బృందాల సహకారం తీసుకోవాలని మోదీ సీఎంలకు సూచించనున్నారు. 


లాక్‌డౌన్‌ కొనసాగించాలా వద్దా అనే అంశంపై కూడా మోదీ చర్చించనున్నారు. చాలా రాష్ట్రాలు ఇప్పటికే నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగించాయి. ఈ తరుణంలో కేంద్రం కూడా నెలాఖరు వరకూ లాక్‌డౌన్ పొడిగించే అవకాశముందని భావిస్తున్నారు.  

Updated Date - 2020-05-10T20:47:54+05:30 IST