నారీ శక్తి అవార్డు గ్రహీతలతో నేడు మోదీ భేటీ
ABN , First Publish Date - 2020-03-08T08:21:24+05:30 IST
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం నారీ శక్తి పురస్కారాలను గెలుచుకున్న వారిని తన నివాసంలో కలవనున్నారు. ప్రధాని సోషల్ మీడియా ఖాతాలను...

వారికే తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతలు
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ ఆదివారం నారీ శక్తి పురస్కారాలను గెలుచుకున్న వారిని తన నివాసంలో కలవనున్నారు. ప్రధాని సోషల్ మీడియా ఖాతాలను ఈ అవార్డు గ్రహీతలే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మోదీ మంగళవారమే ట్వీట్ చేశారు. దీనికి ‘షీ ఇన్‌స్పైర్స్ అజ్’ అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసి క్యాంపెయిన్ ప్రారంభించారు. మహిళలు ఇందులో పాల్గొని తమ విజయగాథలను అందరితో పంచుకోవాలని పిలుపునిన్చారు. అయితే ‘షీ ఇన్‌స్పైర్స్’ క్యాంపెయిన్‌లో తనను చేర్చడంపై ప్రముఖ పర్యావరణ వేత్త, 8 ఏళ్ల లిసిప్రియా కంగుజామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రియమైన మోదీ గారు... నా గళాన్ని వినిపించుకోనప్పుడు నన్ను మీ క్యాంపెయిన్‌లో భాగస్వామిని చేయకండి’’ అని ట్వీట్ చేశారు.