మోదీ నా మిత్రుడు.. భారత పర్యటన కోసం ఎదురు చూస్తున్నా: ట్రంప్

ABN , First Publish Date - 2020-02-12T22:36:50+05:30 IST

భారత పర్యటన కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

మోదీ నా మిత్రుడు.. భారత పర్యటన కోసం ఎదురు చూస్తున్నా: ట్రంప్

వాషింగ్టన్: భారత పర్యటన కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నెల 24,25ల్లో భారత్‌లో ట్రంప్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటనలో భారత్, అమెరికా రెండు దేశాలూ వాణిజ్య ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇదే జరిగితే ఇరుదేశాలకూ చాలా మంచి జరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అలాగే భారత ప్రధాని మోదీ తన మిత్రుడని, తనకు లక్షల మంది భారతీయులు ఆహ్వానం పలుకుతారని మోదీ చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు.

Updated Date - 2020-02-12T22:36:50+05:30 IST