అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-04-01T22:48:19+05:30 IST

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు, కరోనా కట్టడికి అవలంబిస్తున్న మార్గాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకోనున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘నిజాముద్దీన్’ వ్యవహారంపై కూడా సీఎంలతో మోదీ చర్చించనున్నారు. వీటితో పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో దాని అమలు రాష్ట్రాల్లో ఏవిధంగా జరుగుతుందన్న అంశంపై కూడా మోదీ సీఎంలతో చర్చించనున్నారు. 

Updated Date - 2020-04-01T22:48:19+05:30 IST