రూ.2000 నోటు మోదీ వద్దన్నారు:నృపేంద్ర

ABN , First Publish Date - 2020-09-18T08:37:22+05:30 IST

పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోటును ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోదీ ఒప్పుకోలేదా? మోదీతో కలిసి పనిచేసిన నృపేంద్ర మిశ్రా అవుననే చెబుతున్నారు...

రూ.2000 నోటు మోదీ వద్దన్నారు:నృపేంద్ర

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2000 నోటును ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోదీ ఒప్పుకోలేదా? మోదీతో కలిసి పనిచేసిన నృపేంద్ర మిశ్రా అవుననే చెబుతున్నారు. 2014-2019 మధ్య ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన మిశ్రా ఓ పత్రికకు రాసిన వ్యాసంలో ఈ విషయాన్ని తెలిపారు. ‘‘2000 నోట్లు ముద్రించాలన్న సూచనను ప్రధాని అంగీకరించలేదు. కానీ, అప్పట్లో జరిగిన పరిణామాలకు అనుగుణంగా నడుచుకున్నారు’’ అని వెల్లడించారు. నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టేందుకు గాను మోదీ సర్కారు 2016 నవంబరులో పెద్ద నోట్లు రద్దు చేసింది.

Updated Date - 2020-09-18T08:37:22+05:30 IST