లాలూపై తీవ్రంగా విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-09-18T20:39:48+05:30 IST

బిహార్ లోని కోసీ రైల్ బ్రిడ్జిని ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ

లాలూపై తీవ్రంగా విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : బిహార్ లోని కోసీ రైల్ బ్రిడ్జిని  ప్రారంభించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగాయని, అప్పటి రైల్వే మంత్రులు ఈ ప్రాజెక్టు గురించి కనీసం ఆందోళన కూడా చెందలేదని పరోక్షంగా లాలూ పై మోదీ మండిపడ్డారు. లాలూ గనుక అనుకుని ఉంటే దీన్ని సాధించేవారని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి లాలూ ఇష్టపడలేదని మోదీ ఆరోపించారు. సరైన భాగస్వామ్య పక్షాలుంటే ప్రతిదీ సాధ్యమేనని పరోక్షంగా మోదీ నితీశ్ ని ప్రశంసించారు.  

Updated Date - 2020-09-18T20:39:48+05:30 IST