యుద్ధం తేదీని నిర్ణయించిన మోదీ
ABN , First Publish Date - 2020-10-27T06:59:44+05:30 IST
చైనా, పాకిస్థాన్లతో యుద్ధం ఎప్పుడు జరుగుతుందో, ఆ తేదీని ప్రధాన మంత్రి నరేంద్ర

బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్
చైనా, పాకిస్థాన్లతో యుద్ధం ఎప్పుడు జరుగుతుందో, ఆ తేదీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని బీజేపీ ఉత్తర ప్రదేశ్ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాల్లో తీసుకున్న విధంగానే ఈ విషయంలో కూడా ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని దేవ్‌సింగ్ చెప్పారు. అంతేకాకుండా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలను ఆయన ఉగ్రవాదులతో పోల్చారు.