మోదీ కూడా నా కొడుకే: షహీన్‌బాగ్ దాదీ

ABN , First Publish Date - 2020-09-25T20:26:43+05:30 IST

మోదీ కూడా నా కొడుకే: షహీన్‌బాగ్ దాదీ

మోదీ కూడా నా కొడుకే: షహీన్‌బాగ్ దాదీ

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా తన కుమారుడి లాంటివాడేనని షహీన్ బాగ్ దాదీ బిల్కిస్ బనో అన్నారు. టైమ్ మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ప్రంపంచంలోని అత్యంత ప్రభావితులైన 100 మంది జాబితాలో షహీన్‌బాగ్ నిరసనకు నాయకత్వం వహించిన బిల్కిస్‌కు చోటు దక్కింది. ఇండియా నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా, బయోలజిస్ట్ రవీంద్ర గుప్తా, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌లు ఈ జాబితాలో ఉన్నారు.


ఈ విషయం గురించి బిల్కిస్ వద్ద ప్రస్తావించగా తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇలాంటిదాన్ని తాను ఊహించలేదని అన్నారు. ‘‘నేను ఖురాన్ షరీఫ్ మాత్రమే చదివాను. బడికి అసలు వెళ్లనే లేదు. కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అదే జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉండడం కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. మోదీ కూడా నా కోడుకే. అతడిని నేను జన్మనివ్వకపోతేనేమి? నా సోదరి అతడికి జన్మనిచ్చింది. అతడు మరింత కాలం జీవించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని షహీన్‌బాగ్ దాదీ చెప్పుకొచ్చింది.


మరో ఇద్దరు బామ్మలతో కలిసి సీఏఏ-ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌ నిరసన చేపట్టిన బిల్కిస్ దాదీది స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్. పదకొండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో షహీన్‌బాగ్‌లోని తన కోడలు, మనవలతో నివసిస్తోంది.

Updated Date - 2020-09-25T20:26:43+05:30 IST