21వ శతాబ్దం ఆకాంక్షలకు ప్రతిరూపమే ఎన్‌ఈపీ: మోదీ

ABN , First Publish Date - 2020-08-02T01:08:56+05:30 IST

ఇరవై ఒకటవ శతాబ్దం ఆకాంక్షలకు అనుగుణంగానే జాతీయ విద్యా విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ) తీసుకువచ్చినట్టు..

21వ శతాబ్దం ఆకాంక్షలకు ప్రతిరూపమే ఎన్‌ఈపీ: మోదీ

న్యూఢిల్లీ: ఇరవై ఒకటవ శతాబ్దం ఆకాంక్షలకు అనుగుణంగానే జాతీయ విద్యా విద్యావిధానం-2020 (ఎన్‌ఈపీ) తీసుకువచ్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉద్యోగార్ధులైన వారిని ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎన్ఈపీ-2020 తయారు చేస్తుందని పేర్కొన్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలో శనివారంనాడు ఆన్‌లైన్‌లో జరిగిన స్మార్మ్ ఇండియా హ్యాకథాన్-2020లో మోదీ ప్రసంగించారు.


విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకువచ్చే మార్పుల వల్ల ఇండియాలోని భాషల ప్రగతి, అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని పేర్కొన్నారు. 'ఇందువల్ల ఇండియా పట్ల మన పరిజ్ఞానం పెరగడంతో పాటు ఐక్యత సాధించవచ్చు. మన నాలెడ్జె పెంచుకునే శతాబ్దం ఇది. నేర్చుకోవడం, రీసెర్చ్, నూతన ఆవిష్కరణల సృష్టికి ఇదే తగిన తరుణం. దేశ నూతన విద్యా విధానం కచ్చితంగా ఈ లక్ష్యంతో ఏర్పరచినదే' అని ప్రధాని వివరించారు. స్కూలు స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకూ విద్యా వ్యవస్థలో పలు మార్పులు చేస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర మంత్రివర్గం గత బుధవారంనాడు ఆమోదించింది.

Updated Date - 2020-08-02T01:08:56+05:30 IST