పీఎం, సీఎం సూచనలను ఖాతరు చేయని ఎమ్మెల్యే!

ABN , First Publish Date - 2020-03-21T16:56:06+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సభలు, సమావేశాలు రద్దు చేయాలంటూ ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను ఎమ్మెల్యే కందాలు ఉపేందర్ రెడ్డి బేఖాతరు చేశారు. కూసుమంచిలో ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే

పీఎం, సీఎం సూచనలను ఖాతరు చేయని ఎమ్మెల్యే!

ఖమ్మం: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సభలు, సమావేశాలు రద్దు చేయాలంటూ ప్రధాన మంత్రి మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను ఎమ్మెల్యే కందాలు ఉపేందర్ రెడ్డి బేఖాతరు చేశారు. కూసుమంచిలో ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి భారీగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మ కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని కార్యక్రమాలు రద్దు చేయాలని, ఎక్కడా జనం గుమికూడవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించొద్దని ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను ఎమ్మెల్యే కందాల ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఫోన్ చేసి మరీ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.

Updated Date - 2020-03-21T16:56:06+05:30 IST