14 మంది సమక్షంలో ఎమ్మెల్యే కుమార్తె వివాహం

ABN , First Publish Date - 2020-04-28T14:29:44+05:30 IST

ఇందులో వధువు, వరుడు కుటుంబసభ్యులు సహా 14 మంది మాత్రమే పాల్గొన్నారు.

14 మంది సమక్షంలో ఎమ్మెల్యే కుమార్తె వివాహం

చెన్నై : ఏర్కాడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే కుమార్తె వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇందులో వధువు, వరుడు కుటుంబసభ్యులు సహా 14 మంది మాత్రమే పాల్గొన్నారు. సేలం జిల్లా ఆర్కాడు నియోజకవర్గ ఎమ్మెల్యే చిత్ర-గుణశేఖర్‌ దంపతుల కుమార్తె సింధు (21), ధర్మపురి జిల్లా పాపిరెట్టిపట్టికి చెందిన విద్యుత్‌ బోర్డు ఇంజనీర్‌ ప్రశాంత్‌ల వివాహం ముఖ్యమంత్రి ఎడప్పాడి నియోజకవర్గమైన వాళప్పాడి లో ఏప్రిల్‌ 26న సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం నేతృత్వంలో జరుగుతుందని వివాహ పత్రికలు ముద్రించారు.


రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న తరుణంలో ఆదివారం ఉదయం వాళప్పాదిలోని కాంద నేశ్వరర్‌ ఆలయంలో హిందూ సంప్రదాయ బద్ధంగా జరిగింది. పురోహితుడు, ఫొటోగ్రాఫర్‌ సహా 14 మంది మాత్రమే హాజరయ్యారు.

Updated Date - 2020-04-28T14:29:44+05:30 IST