యూపీలో మరో దారుణం...

ABN , First Publish Date - 2020-10-12T14:40:12+05:30 IST

హాథ్రస్ ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది....

యూపీలో మరో దారుణం...

అదృశ్యమైన టీనేజ్ బాలిక మృతదేహం చెరకు తోటలో లభ్యం

లక్నో (ఉత్తరప్రదేశ్): హాథ్రస్ ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. యూపీలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని పసాగవాన్ గ్రామంలో తప్పిపోయిన టీనేజ్ బాలిక ఆదివారం రాత్రి మృతదేహమై చెరకు పొలంలో కనిపించింది. టీనేజ్ బాలిక మెడ వద్ద గాయం గుర్తులు కనిపించడంతో ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాలిక అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు గ్రామంలో ఎవరితోనూ శత్రుత్వం లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. 


బాలిక మృతదేహం లభించిన సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణులు, క్రైంబ్రాంచ్ పోలీసులను రంగంలోకి దించారు. జిల్లా ఎస్పీ విజయ్ ధుల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలిక మృతదేహం పోస్టుమార్టం తర్వాత చర్యలు తీసుకుంటామని ఎస్పీ విజయ్ చెప్పారు.

Updated Date - 2020-10-12T14:40:12+05:30 IST