గడ్డకట్టిన కశ్మీర్‌!

ABN , First Publish Date - 2020-12-28T08:30:58+05:30 IST

కశ్మీర్‌లో చలి విజృంభిస్తోంది. 40 రోజుల పాటు సాగే అతి శీతల కాలం సీజన్‌ ప్రస్తుతం నడుస్తుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో ఆదివారం నాటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి...

గడ్డకట్టిన కశ్మీర్‌!

  • మైనస్‌ 7.2 డిగ్రీలు నమోదు
  • ఘనీభవించిన సరస్సులు

శ్రీనగర్‌, డిసెంబరు 27: కశ్మీర్‌లో చలి విజృంభిస్తోంది. 40 రోజుల పాటు సాగే అతి శీతల కాలం సీజన్‌ ప్రస్తుతం నడుస్తుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో ఆదివారం నాటి ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి. అత్యల్పంగా గుల్‌ మార్గ్‌లో మైనస్‌ 7.2 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ‘‘ఈ నెల 12 హిమపాతం పడిన నాటి నుంచి అతి శీతల ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. శ్రీనగర్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్‌ 5.2 డిగ్రీలు, పహల్గాంలో మైనస్‌ 5.9 డిగ్రీలు, గుల్‌మార్గ్‌లో అత్యల్పంగా మైనస్‌ 7.2 డిగ్రీలు గత రాత్రి నమోదయ్యాయి’’ అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల కనిష్ఠ ఉష్ణోగ్రతలు చూస్తే.. కాజీగుండ్‌లో మైనస్‌ 5డిగ్రీలు, కుప్వారాలో మైనస్‌ 4.8డిగ్రీలు, కొకెర్‌నాగ్‌లో మైనస్‌ 4.9 డిగ్రీలుగా నమోదైనట్లు వెల్లడించారు. మైనస్‌ ఉష్ణోగ్రతల ప్రభావంతో.. ప్రముఖ దాల్‌ సరస్సు సహా కశ్మీర్‌ వ్యాప్తంగా సరస్సులన్నీ గడ్డకట్టుకుపోవడం గమనార్హం. 

Updated Date - 2020-12-28T08:30:58+05:30 IST