హోమ్‌వర్క్ చేయలేదని బాలికపై మరిగే నూనె పోసి...

ABN , First Publish Date - 2020-12-10T16:02:11+05:30 IST

యూపీలోని గోరఖ్‌పూర్‌లోని మియాబజార్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక హోమ్‌వర్క్ చేయలేదని ఎదురింట్లో ఉంటున్న...

హోమ్‌వర్క్ చేయలేదని బాలికపై మరిగే నూనె పోసి...

గోరఖ్‌పూర్: యూపీలోని గోరఖ్‌పూర్‌లోని మియాబజార్ ప్రాంతానికి చెందిన ఒక బాలిక హోమ్‌వర్క్ చేయలేదని ఎదురింట్లో ఉంటున్న 16 ఏళ్ల యువతి, ఆమె తల్లి కలసి ఆ బాలికపై మరుగుతున్న నూనె పోశారు. ఆ చిన్నారి వారి ఇంట్లో ట్యూషన్ చదువుతోంది. ఈ ఘటనలో ఆ బాలిక చేతులతో పాటు శరీరంలోని కొంత భాగం కాలిపోయింది. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతితోపాటు ఆమె తల్లిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక తల్లి ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటుంది. ఆమె భర్త ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంటాడు. 


బాధితురాలి తల్లి పోలీసులకిచ్చిన ఫిర్యాదు ప్రకారం వారికి ముగ్గురు కుమార్తెలు. ఈ ముగ్గురూ ఎదురింట్లో ఉంటే యువతి దగ్గర ట్యూషన్ చదువుతుంటారు. రోజూమాదిరిగానే మంగళవారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లారు. వారిలో ఐదేళ్ల బాలిక హోమ్‌వర్క్ చేయలేదు. ఈ విషయమై టీచర్ అడగగా, మరచిపోయానని ఆ బాలిక చెప్పింది. దీంతో ఆ టీచర్ మిగిలిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఇంటికి పంపించేసి, ఆ బాలికను మాత్రం తన దగ్గరే ఉండమంది. ఆ సమయంలో ఆ యువతి తల్లి ఇంట్లో సమోసాలను నూనెలో వేయిస్తోంది. ఆ మరుగుతున్న నూనెను ఆ యువతితోపాటు ఆమె తల్లి ఆ బాలిక చేతులు, శరీరంపై కొన్ని భాగాల్లో పోశారు. దీంతో ఆ బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. వెంటనే తల్లి పోలీసులకు ఫోనుచేసి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నారు.


Updated Date - 2020-12-10T16:02:11+05:30 IST