కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన కరోనా అప్‌డేట్స్ ఇవే
ABN , First Publish Date - 2020-06-25T19:10:25+05:30 IST
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 4,73, 105 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే 16, 922 మందికి కరోనా సోకింది. గడచిన 24 గంటల్లో 418 మంది చనిపోయారు.

న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 4,73, 105 మందికి కరోనా సోకింది. నిన్న ఒక్కరోజే 16, 922 మందికి కరోనా సోకింది. గడచిన 24 గంటల్లో 418 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14, 894కు చేరింది. ఇప్పటివరకూ 2, 71, 697 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా నుంచి రికవరీ రేటు 57.43 శాతానికి చేరిందని ప్రకటించింది.
మరోవైపు ఇప్పటివరకూ 76 లక్షల శాంపిళ్లు టెస్ట్ చేశామని తెలిపిన ఐసీఎంఆర్ కరోనా టెస్టులు చేపట్టేందుకు వెయ్యవ ల్యాబరటరీకి అనుమతిచ్చామని వెల్లడించింది. రోజుకు రెండు లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది.