ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే నాకు కరోనా సోకింది : మహారాష్ట్ర మంత్రి పశ్చాత్తాపం

ABN , First Publish Date - 2020-05-18T22:49:49+05:30 IST

అతి ఆత్మవిశ్వాసం వల్లే తాను కరోనా మహమ్మారికి గురయ్యానని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అహ్వద్ ప్రకటించారు. ఆయన

ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే నాకు కరోనా సోకింది : మహారాష్ట్ర మంత్రి పశ్చాత్తాపం

ముంబై : అతి ఆత్మవిశ్వాసం వల్లే తాను కరోనా మహమ్మారికి గురయ్యానని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అహ్వద్ ప్రకటించారు. ఆయన సెక్యూరిటీ విధులు నిర్వర్తించే ఓ అధికారికి ఏప్రిల్ 13 న కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ముందు జాగ్రత్తగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా... మంత్రికి పాజిటివ్ అని పరీక్షలో తేలింది. అయితే మే 10 వ తేదీన ఆయన పూర్తిగా కోలుకొని... ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తనకు రక్తపోటు, డయాబెటీస్ ముందునుంచే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


‘‘నా అతి ఆత్మ విశ్వాసమే నాకు కరోనా వచ్చేలా చేసింది. ఏప్రిల్ 23 నుంచి 26 వరకూ నా జీవితంలో అత్యంత కీలకమైన రోజులు. అత్యంత ముఖ్యమైనవి కూడా. నేను బతకడానికి చాలా తక్కువగా అవకాశాలున్నాయని మా కుటుంబీకులు ఆందోళన చెందారు. ఆ సమయంలో జీవితం గురించి చాలా ఆందోళన చెందా. ప్రతి నిమిషం కూడా జీవితమూ, మరణం గురించే ఆలోచించా. జీవన్మరణ సమస్యలా పోరాడా’’ అని మంత్రి జితేంద్ర ఆహ్వా తెలిపారు.


చివరికి తన ఆస్తి మొత్తం తన కూతురుకే చెందేలా ఐసీయూలోనే వీలునామా కూడా రాసేశానని ఆయన తెలిపారు. ఆరోగ్యంపై, జీవన శైలితో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించానని కరోనాతో నాకు రూఢీ అయ్యిందని, ఇప్పుడు మాత్రం జీవన శైలిని చాలా క్రమశిక్షణతో గడిచేలా చూస్తానని జితేంద్ర ఆహ్వా పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-18T22:49:49+05:30 IST