టెన్త్‌ పరీక్షలు కచ్చితంగా జరుగుతాయ్..: మంత్రి క్లారిటీ

ABN , First Publish Date - 2020-04-21T15:51:50+05:30 IST

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన టెన్త్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తామని

టెన్త్‌ పరీక్షలు కచ్చితంగా జరుగుతాయ్..:  మంత్రి క్లారిటీ

చెన్నై : ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన టెన్త్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి సెంగోట్టయన్‌ తెలిపారు. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో గత నెల 27వ తేది నుంచి ప్రారంభం కావాల్సిన టెన్త్‌ పబ్లిక్‌ లాక్‌డౌన్‌ విధించడంతో వాయిదాపడ్డాయి. తాజాగా  మే 3వ తేదీ వరకు పొడిగించడంతో టెన్త్‌ పరీక్షలు జరుగుతాయా, లేదా అనే అనుమానం నెలకొంది.


ఈ విషయమై సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి సెంగోట్టయన్‌ మాట్లాడుతూ... టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు తప్పనిసరిగా జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన టైంటేబుల్‌ను మే 3వ తేదీ తరువాత వెలువరిస్తామన్నారు. ప్రతి పరీక్షకు ఒక సెలవు రోజు ఉంటుందని తెలిపారు..

Updated Date - 2020-04-21T15:51:50+05:30 IST