మంత్రి ఆనంద్‌సింగ్‌ కుమార్తెపై ఆరోగ్యశాఖ నిఘా

ABN , First Publish Date - 2020-03-19T13:56:25+05:30 IST

మంత్రి ఆనంద్‌సింగ్‌ కుమార్తెపై ఆరోగ్యశాఖ నిఘా

మంత్రి ఆనంద్‌సింగ్‌ కుమార్తెపై ఆరోగ్యశాఖ నిఘా

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అటవీ శాఖా మంత్రి ఆనంద్‌సింగ్‌ కుమార్తెపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది. మంత్రి కుమార్తె వైష్ణవి రోమ్‌నగర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తోంది. అక్కడ పరిస్థితి క్లిష్టంగా మారడంతో బుధవారం బెంగళూరుకు వాపసు వచ్చారు. విదేశాల నుంచి వచ్చినవారికి 14 రోజుల పాటు బయట తిరిగే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే గృహ నిర్భంధం చేశారు. బెంగళూరులోని మంత్రి నివాసంలో ప్రత్యేక గదిని కేటాయించి అవసరమైన వస్తువులను సమకూర్చారు. వైద్యుల సలహా మేరకు 14 రోజుల పాటు గది నుంచి బయటకి రాకూడదని ఆంక్షలు విధించారు. ఒకవేళ జ్వరం, జలుబు, దగ్గు వస్తే ల్యాబ్‌ ద్వారా నిర్ధారణ చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-03-19T13:56:25+05:30 IST