బెళగావి నగర పాలికెలో పోటీకి ఎంఐఎం సమాయత్తం

ABN , First Publish Date - 2020-12-25T08:42:03+05:30 IST

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా మనుగడలో ఉన్న ఎంఐ ఎం పార్టీ కర్ణాటక రాష్ట్ర పరిధిలోని ఉత్తర ప్రాంతంలో కాలుపెట్టేందుకు సమాయత్తమవుతోంది.

బెళగావి నగర పాలికెలో పోటీకి ఎంఐఎం సమాయత్తం

బెంగళూరు, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా మనుగడలో ఉన్న ఎంఐ ఎం పార్టీ కర్ణాటక రాష్ట్ర పరిధిలోని ఉత్తర ప్రాంతంలో కాలుపెట్టేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు బెళగావి నగర పాలికె ఎన్నికలలో పోటీ చేసేందుకు పావులు కదుపుతోంది. ఉత్తర కర్ణాటక కేంద్రంగా పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు బుధవారం బెళగావిలో కీలక సమావేశం నిర్వహించారు. ఎంఐఎం రాష్ట్ర ప్రఽధానకార్యదర్శి లతీ్‌ఫఖాన్‌ ఇదే విషయమై గురువారం మీడియాతో మాట్లాడుతూ బెళగావి నగర పాలికెలో సాధ్యమైనన్ని వార్డులలో అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించామన్నారు. 

Updated Date - 2020-12-25T08:42:03+05:30 IST