గుర్తించని కరోనా కేసులు మిలియన్లలో : అధ్యయన నివేదిక
ABN , First Publish Date - 2020-09-12T07:54:12+05:30 IST
ఈ ఏడాది తొలినాళ్లలోనే దేశంలో చాపకింద నీరులా కరోనా వ్యాప్తి జరిగినా..

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ఈ ఏడాది తొలినాళ్లలోనే దేశంలో చాపకింద నీరులా కరోనా వ్యాప్తి జరిగినా.. మిలియన్ల కొద్దీ ఇన్ఫెక్షన్లను గుర్తించలేకపోయారని ఓ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆ సమయానికి.. ఇన్ఫెక్షన్ లక్షణాలు కలిగిన వారికే టెస్టులు నిర్వహించడం, టెస్టులకు భారీ రేట్లు ఉండటంతో ఆ దుస్థితి ఏర్పడిందని తేల్చి చెప్పింది. మే నెలలో ప్రభుత్వ గణాంకాల్లోకి ఎక్కిన ప్రతి ఒక్క కొవిడ్-19 కేసుకుగానూ.. నమోదు కాని ఇన్ఫెక్షన్ల సం ఖ్య 82 నుంచి 130 దాకా ఉంటుందని పేర్కొంది. ఈ లెక్కన మే మొదటివా రం నాటికే దేశంలో 65 లక్షల మంది ఇన్ఫెక్షన్ల బారినపడి ఉండొచ్చని అం చనా వేసింది. అయితే కేంద్ర ఆరోగ్యశాఖ మాత్రం మే నెలాఖరు సమయానికి దేశంలో 1.80 లక్షల కేసులే ఉన్నాయని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసింది. నాడు గుర్తించలేకపోయిన ఇన్ఫెక్షన్లే.. నేడు కరోనా కేసుల పట్టికలో భారత్ పైపైకి వెళ్లడానికి కారణభూతం అవుతున్నాయని విశ్లేషించింది. ప్రభుత్వ శాస్త్రవేత్తలఅధ్యయన బృందం రూపొందించిన ఈ నివేదిక ‘ది ఇం డియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’లో గురువారం ప్రచురితమైంది.