కాంగ్రెస్ యువనేతలనుంచి పైలట్‌కు అనూహ్య మద్దతు

ABN , First Publish Date - 2020-07-15T00:24:00+05:30 IST

న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ పార్టీ యువనేతలు మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టపడిన పైలట్ పార్టీని వీడటం దురదృష్టకరమంటూ మహారాష్ట్ర కాంగ్రెస్

కాంగ్రెస్ యువనేతలనుంచి పైలట్‌కు అనూహ్య మద్దతు

న్యూఢిల్లీ: సచిన్ పైలట్‌కు కాంగ్రెస్ పార్టీ యువనేతలు మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కష్టపడిన పైలట్ పార్టీని వీడటం దురదృష్టకరమంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు ప్రియాదత్ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో ఆమె జ్యోతిరాదిత్య సింధియాను కూడా గుర్తు చేశారు. గొప్ప సామర్థ్యమున్న ఇద్దరు యువనేతలు పార్టీని వీడిపోయారంటూ ట్వీట్‌లో తెలిపారు. సచిన్ సీఎం పదవికి పట్టుబట్టారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఆశయాలు కలిగి ఉండటం తప్పుకాదని ప్రియాదత్ చెప్పారు. 





సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి అంకితమై సేవ చేశారంటూ జితిన్ ప్రసాద ట్వీట్ చేశారు. పైలట్ పార్టీని వీడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంతదాకా రాకుండానే పరిష్కరించాల్సిందని అభిప్రాయపడ్డారు. 

 


పార్టీ నుంచి అందరూ వెళ్లిపోతే ఇక మిగిలేది ఎవరని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు. ఎలాగైనా చేసి పైలట్‌ను పార్టీ వీడకుండా చూడాలన్నారు. 




మహారాష్ట్రకు చెందిన మిలింద్ దేవ్‌రా కూడా పైలట్‌ను పార్టీ వీడేలా చేయడంపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 

Updated Date - 2020-07-15T00:24:00+05:30 IST