సూరత్‌లో కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2020-05-09T19:59:34+05:30 IST
తమను స్వస్థలాలకు పంపించాలంటూ సూరత్‌లోని వలస కూలీలు పోలీసులతో గొడవకు దిగారు. మోరా గ్రామంలోని
అహ్మదాబాద్: తమను స్వస్థలాలకు పంపించాలంటూ సూరత్‌లోని వలస కూలీలు పోలీసులతో గొడవకు దిగారు. మోరా గ్రామంలోని వలస కూలీలు స్థానిక పోలీసులపై దాడులకు దిగడం, పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో పోలీసులు వలస కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక అధికారులు వెంటనే తాము స్వస్థలాలకు వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వలస కార్మికులు ఎక్కువగా యూపీ, బిహార్ ,ఒడిశా ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.