వలస కార్మికుల బస్సు బోల్తా, ఏడుగురికి గాయాలు

ABN , First Publish Date - 2020-05-31T00:20:45+05:30 IST

వలస కార్మికులతో వెళుతున్న బస్సు ఒకటి శనివారంనాడు ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తాపడటంతో ఏడుగురు వలస..

వలస కార్మికుల బస్సు బోల్తా, ఏడుగురికి గాయాలు

బాలాసోర్: వలస కార్మికులతో వెళుతున్న బస్సు ఒకటి శనివారంనాడు ప్రమాదానికి గురైంది. బస్సు బోల్తాపడటంతో ఏడుగురు వలస కూలీలు గాయపడ్డారు. కేరళ నుంచి పశ్చిమబెంగాల్‌కు 38 మంది వలస కూలీలతో బస్సు వెళ్తుండగా ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.


స్థానికుల సహకారంతో ప్రయాణికులను కాపాడి, జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. వలస కార్మికులను వేరే బస్సులో తమతమ గమ్యస్థానాలకు పంపుతామని అన్నారు. మార్చిలో దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి పశ్చిమబెంగాల్ వలస కార్మికులు కేరళలో చిక్కుకుపోయారు.

Updated Date - 2020-05-31T00:20:45+05:30 IST