వలస కూలీ రోడ్డు మీదే ప్రసవం

ABN , First Publish Date - 2020-05-11T07:28:58+05:30 IST

వలస కూలీ అయిన ఆమె నిండు గర్భిణి. కాలినడకన 1050 కిలోమీటర్ల దూరంలోని తన సొంతూరుకు బయలుదేరింది. 210 కిలోమీటర్ల దూరం నడిచింది. పురిటి నొప్పులు రావడంతో...

వలస కూలీ రోడ్డు మీదే ప్రసవం

  • తల్లీబిడ్డ క్షేమం.. మహారాష్ట్రలో ఘటన


బర్వానీ (మధ్యప్రదేశ్‌), మే 10: వలస కూలీ అయిన ఆమె నిండు గర్భిణి. కాలినడకన 1050 కిలోమీటర్ల దూరంలోని తన సొంతూరుకు బయలుదేరింది. 210 కిలోమీటర్ల దూరం నడిచింది. పురిటి నొప్పులు రావడంతో రోడ్డు మీదే ప్రసవించింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ప్రసవించిన మహిళ పేరు శకుంతల. తనవాళ్లతో కలిసి ఆమె మహారాష్ట్రలోని నాసిక్‌లో పనులు చేసుకునేది. లాక్‌డౌన్‌తో పనులు లేకవడంతో కుటుంబసభ్యులతో కలిసి మధ్యప్రదేశ్‌లోని తమ సొంతూరైన సాత్నాకు బయలుదేరింది. నాసిక్‌-ధులె ప్రాంతానికి మధ్య ఓ గ్రామం వద్ద ఆమె ప్రసవించింది. ఆమెకు ఇది నాలుగో కాన్పు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2020-05-11T07:28:58+05:30 IST