మరో 15 రోజులు తప్పదేమో!

ABN , First Publish Date - 2020-03-24T09:42:30+05:30 IST

దేశ ప్రజలు తమ ఇళ్లకు పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం, అన్ని సంస్థలు మూసేయడం, సమావేశాలు రద్దు కావడం వంటివి మరో 15 రోజులు కొనసాగక...

మరో 15 రోజులు తప్పదేమో!

కరోనా ఆంక్షలపై ఎంపీలతో ప్రధాని

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలు తమ ఇళ్లకు పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం, అన్ని సంస్థలు మూసేయడం, సమావేశాలు రద్దు కావడం వంటివి మరో 15 రోజులు కొనసాగక తప్పదేమోనని ప్రధాని నరేంద్రమోదీ అన్నట్లు తెలిసింది. సోమవారం లోక్‌సభ ముగిసిన తర్వాత స్పీకర్‌ చాంబర్‌ లో ఆయనను పలువురు పార్టీల నేతలు కలిశారు.


ఎన్నాళ్లు ఈ దిగ్బంఽధం ఉంటుందని వారు ప్రశ్నించినపుడు మరో 15 రోజుల్లో అంతా సజావుగా మారవచ్చని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైరస్‌ వల్ల జరిగిన నష్టాన్ని పూరించేందుకు ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి కోరగా, దానిపై పరిశీలిస్తున్నామని ప్రధాని జవాబిచ్చినట్లు తెలిసింది. లాక్‌డౌన్‌ ను ప్రజలు సీరియ్‌సగా తీసుకోవడం లేదని ట్వీట్‌లో ప్రధాని ఆక్షేపించారు. లాక్‌డౌన్‌ను మరింత సీరియ్‌స గా అమలు చేయాలని కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శు లకు పంపిన తాఖీదులో పేర్కొన్నారు.

Read more