అరేబియా సముద్రంలో కూలిన మిగ్-29కే శిక్షణ విమానం
ABN , First Publish Date - 2020-11-27T16:08:16+05:30 IST
అరేబియా సముద్రంలో మిగ్ 29 శిక్షణ యుద్ధ విమానం కూలిపోయింది.

న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో మిగ్ 29 శిక్షణ యుద్ధ విమానం కూలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు సముద్రంలో పడిపోయారు. ఒక పైలట్ ఆచూకీ లభ్యంకాగా, మరో పైలట్ కోసం నేవీ అధికారులు గాలిస్తున్నారు. గోవాలోని ఐఎన్‌ఎస్ హన్సా నుంచి బయల్దేరిన మిగ్-29కే విమానం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద ఘటనపై నేవీ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. రోజువారీ శిక్షణలో భాగంగా దక్షిణ గోవాలోని ఐఎన్‌ఎస్ హన్సా నుంచి మిగ్-29కే విమానం బయలుదేరింది. ప్రస్తుతం భారత రక్షణ శాఖ వద్ద 40 మిగ్-29కే ఫైటర్ జెట్స్ ఉన్నాయి. కాగా ఈ ఏడాది మిగ్-29కే విమానం కుప్పకూలడం ఇది మూడోసారి.