పంజాబ్‌లో కూలిన మిగ్‌-29

ABN , First Publish Date - 2020-05-09T09:17:03+05:30 IST

భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన మిగ్‌ -29 యుద్ద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది.

పంజాబ్‌లో కూలిన మిగ్‌-29

  • సురక్షితంగా బయటపడిన పైలట్‌

అల్వాల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి) : భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన మిగ్‌ -29 యుద్ద్ధ విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది. పంజాబ్‌లో జలంధర్‌ సమీపంలోని చుహార్‌పూర్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈ దుర్ఘటన జరిగిందని ఐఏఎఫ్‌ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్రామంలోని నిర్మానుష్యంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ జెట్‌ కూలిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయినా స్థానికంగా మంటలు చెలరేగాయి. శిక్షణలో భాగంగా పైలట్‌ ఈ యుద్ధవిమానాన్ని నడుపుతున్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో జెట్‌ను పైలట్‌ అదుపు చేయలేకపోవడంతో విమానం కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు. కాగా విమానం కూలిపోవడానికి ముందే పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటను పైలట్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఐఏఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు. 

Updated Date - 2020-05-09T09:17:03+05:30 IST