లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు

ABN , First Publish Date - 2020-04-25T10:38:42+05:30 IST

లాక్‌డౌన్ నుంచి కొన్ని దుకాణాలకు మినహాయింపునిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం అర్దరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది....

లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులు

 నివాసప్రాంతాల్లోని కొన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం కొంతమేరకు సడలించింది. గ్రామీణ, చిన్నపట్టణాల్లో షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. లాక్‌డౌన్ నుంచి కొన్ని దుకాణాలకు మినహాయింపునిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ శుక్రవారం అర్దరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ నివాస ప్రాంతాల్లోని కొన్ని దుకాణాలు తిరిగి తెరిచేందుకు అనుమతిని కేంద్రం మంజూరు చేసింది. మున్సిపల్ నివాసప్రాంతాల్లో అక్కడక్కడా విడిగా ఉన్న దుకాణాలను 50 శాతం సిబ్బందితో అవసరమైన జాగ్రత్తలు తీసుకొని తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. మున్సిపల్ నివాస సముదాయాల్లో స్వతంత్ర దుకాణాలు తెరిచేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని షాపుల విషయంలో సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ లు ధరిస్తూ 50 శాతం సిబ్బందితో తిరిగి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించవచ్చని కేంద్రం పేర్కొంది. కాగా మున్సిపాలిటీల్లోని మార్కెట్ ప్రదేశాలు, మల్టీబ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ లలోని దుకాణాలు మాత్రం మే 3వతేదీ వరకు మూసివేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సంతకం చేసిన ఈ ఉత్తర్వులను శుక్రవారం అర్దరాత్రి విడుదల చేసింది. కరోనా హాట్ స్పాట్ లు, కంటైనర్ జోన్ లలో మాత్రం అన్ని దుకాణాలను మూసి ఉంచాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. Updated Date - 2020-04-25T10:38:42+05:30 IST