కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన.. జనవరి 31, 2021 వరకూ..

ABN , First Publish Date - 2020-12-29T02:26:10+05:30 IST

కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా సూచించిన మార్గదర్శకాలను జనవరి 31, 2021 వరకూ పొడిగిస్తున్నట్లు...

కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన.. జనవరి 31, 2021 వరకూ..

జనవరి 31, 2021 వరకూ లాక్‌డౌన్ మార్గదర్శకాలను పొడిగించిన కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ: కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా సూచించిన మార్గదర్శకాలను జనవరి 31, 2021 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది. కంటైన్మెంట్ జోన్లపై ఎప్పటిలాగే నిఘా కొనసాగుతుందని తెలిపింది. నిబంధనలను కంటైన్మెంట్ జోన్లలో కఠినంగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. యూకేలో కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలకు హోం శాఖ సూచించింది. నవంబర్ 25న కేంద్ర హోం శాఖ, వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలనే జనవరి 31, 2021 వరకూ పాటించాలని కేంద్రం సూచించింది. ఆరోగ్య సేతు యాప్‌ను విధిగా అందరూ వినియోగించాలని కోరింది. కంటైన్‌మెంట్ జోన్ల బయట 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లకు కేంద్రం అనుమతినిచ్చింది.Updated Date - 2020-12-29T02:26:10+05:30 IST