కరోనా వ్యాప్తితో మెక్సికో సిటీలో తిరిగి లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-12-19T14:28:18+05:30 IST

మెక్సికో సిటీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధిస్తామని మెక్సికన్ అధికారులు చెప్పారు....

కరోనా వ్యాప్తితో మెక్సికో సిటీలో తిరిగి లాక్‌డౌన్

మెక్సికో సిటీ : మెక్సికో సిటీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధిస్తామని మెక్సికన్ అధికారులు చెప్పారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతుండటంతో శనివారం నుంచి జనవరి 10వతేదీ వరకు మెక్సికో సిటీతోపాటు రాజధానికి మూడువైపులా ఉన్న మెక్సికో రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మెక్సికన్ ఉప ఆరోగ్యశాఖ మంత్రి హ్యూగో లోపెజ్ గాటెల్ చెప్పారు. రాబోయే మూడు వారాల్లో కరోనా వ్యాప్తి, కరోనా మరణాలను తగ్గించడానికి లాక్ డౌన్ లాంటి అసాధారణ చర్యలు అవసరమని లోపెజ్ గాటెల్ చెప్పారు. 


మెక్సికోలో నూతన సంవత్సర ఉత్సవాల సందర్భంగా కరోనా ప్రబలకుండా నిరోధించేందుకే మళ్లీ లాక్ డౌన్ ను విధించారు.మెక్సికో నగరంలో 2,77,733 కరోనా కేసులు నమోదు కాగా, 15,083 మంది మరణించారు. మెక్సికో దేశంలో 12,89,298మందికి కరోనా సోకగా, దీంతో 1,16,487 మంది మరణించారు.

Read more