ఉబెర్‌ యాప్‌లో మెట్రో రైలు వివరాలు...

ABN , First Publish Date - 2020-09-18T21:39:01+05:30 IST

ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకంగా మారిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్ఎంఆర్) తో ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ఉబెర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. కరోనా ప్రభావంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. మొత్తంమీద... మరోవైపు... ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడే నిలిచిపోయింది.

ఉబెర్‌ యాప్‌లో మెట్రో రైలు వివరాలు...

హైదరాబాద్ : ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకంగా మారిన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్ఎంఆర్) తో ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ఉబెర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. కరోనా ప్రభావంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. మొత్తంమీద... మరోవైపు... ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడిక్కడే నిలిచిపోయింది.


ప్రైవేట్ క్యాబ్, టాక్సీలు తప్ప పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ... రోడ్డెక్కేందుకు ఇంకా జంకుతునే ఉన్నాయి. కరోనా ఆన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ఒక్క ప్రధాన నగరాల్లో మాత్రం మెట్రో రైళ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే... మెట్రో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రైవేట్ క్యాబ్ ఆపరేటర్లు సరికొత్త సౌకర్యాలతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలో ఎంతో కీలకమైన హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌తో ప్రముఖ క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ఉబెర్‌ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.


ఈ ఒప్పందం ప్రకారం... ఉబెర్‌ యాప్‌లో మెట్రో రైలుకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. కొత్త ఫీచర్‌తో మెట్రో ప్రయాణికులు, ఉబెర్‌ వినియోగదారులు తమ ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా మార్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. ఇప్పటికే ఢిల్లీ మెట్రోతో ఉబెర్ సంస్థ గతేడాది అక్టోబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఉబెర్‌ యాప్‌లో ప్రజా రవాణా వ్యవస్థలో ఉండే ప్రయాణ సాధనాల ప్రత్యక్ష సమయాలను, మార్గాలను ప్రయాణికులు ఆన్‌లైన్‌లోనే తెలుసుకునేందుకు వీలవుతుంది.


దీంతో నగరంలో ఉబెర్‌ ప్రయాణికులకు మెట్రోతో పాటు ఆర్టీసీ బస్సులతో అనుసంధానం ఏర్పడి, ఎక్కడా జాప్యం లేకుండా వేగంగా నిర్ణీత సమయంలో గమ్య స్థానాలను చేరుకోవచ్చని ఉబెర్‌ తెలిపింది. ముఖ్యంగా మెట్రో రైలు ప్రయాణంలో ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీకి రైడ్‌ షేరింగ్‌ మోడ్‌లు ఈ యాప్‌లో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఉబెర్‌ వివరించింది.

Updated Date - 2020-09-18T21:39:01+05:30 IST