జూలై 1 నుంచి మెట్రో సర్వీస్ పున:ప్రారంభం.. చర్చిస్తున్నామన్న సీఎం

ABN , First Publish Date - 2020-06-27T03:20:43+05:30 IST

అన్‌లాక్‌ 1.0 ప్రకటించినప్పటినుంచి దేశంలో పలు సర్వీసులు పున:ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. బెంగాల్‌లో కూడా పలు సర్వీసులను...

జూలై 1 నుంచి మెట్రో సర్వీస్ పున:ప్రారంభం.. చర్చిస్తున్నామన్న సీఎం

కలకత్తా: అన్‌లాక్‌ 1.0 ప్రకటించినప్పటినుంచి దేశంలో పలు సర్వీసులు పున:ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. అయితే బెంగాల్‌లో జూలై 31 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయినప్పటికీ పలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలో కలకత్తా మెట్రో సర్వీసులను తిరిగి మొదలు పెట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. దీనికి సంబంధించిన అనుకూలతలపై అధికారులతో చర్చలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చర్చలు సఫలమైతే జూలై 1 నుంచి మెట్రో సర్వీసులు పున:ప్రారంభమవుతాయని వెల్లడించారు. అయితే మెట్రో ట్రైన్‌లో సీట్లకు సరిపడా ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని, అంతకుమించి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు నైట్‌కర్ఫ్యూ రాత్రి 9గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగేదని, ఇకమీదట రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ ప్రారంభమవుతుందని మమతా బెనర్జీ తెలిపారు.

Updated Date - 2020-06-27T03:20:43+05:30 IST