రాష్ట్రపతి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-12-25T08:48:56+05:30 IST

క్రిస్మస్‌ సందర్భంగా దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి క్రిస్మస్‌ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, డిసెంబరు 24: క్రిస్మస్‌ సందర్భంగా దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  గురువారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా శాంతిని పెంపొందించడానికి, మానవాళిలో సామరస్యాన్ని కొనసాగించడానికి సహాయపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఏసుక్రీస్తుని ఆరాధించడంతోపాటు సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్‌ అని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా క్రీస్తు బోధనలు ప్రేమ, కరుణ, మానవత్వంతోకూడిన బోధనలతో సమాజాన్ని నింపుదామన్నారు.  

Updated Date - 2020-12-25T08:48:56+05:30 IST