మానసిక వికలాంగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం

ABN , First Publish Date - 2020-12-06T07:02:11+05:30 IST

మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది.

మానసిక వికలాంగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం

 అత్యాచార బాధితురాలికి సుప్రీంకోర్టు అండ


న్యూఢిల్లీ, డిసెంబరు 5: మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. పశువులను మేపడానికి పొలానికి వెళ్లిన 19 ఏళ్ల యువతిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది. ఆమె మానసిక వికలాంగురాలు కావడంతో తనకు ఏం జరిగిందో, ఎవరు చేశారో చెప్పలేక పోయింది. పుట్టిన బిడ్డపై డీఎన్‌ఏ పరీక్ష చేయగా సదరు నిందితుడు తండ్రని తేలింది. 2008లో ఈ సంఘటన జరిగింది. ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారన్న కారణంతో కింది కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించగా, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు మొత్తం కేసును పునర్విచారించి, నిందితుడిని దోషిగా తేల్చింది. ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. నిందితుడు సుప్రీంను ఆశ్రయించగా.. దిగువ కోర్టు తీర్పును సమర్ధించింది. మానసిక వికలాంగులను ప్రత్యేకమైన శ్రద్ధతో, ప్రేమతో చూడాలని వ్యాఖ్యానించింది.

Updated Date - 2020-12-06T07:02:11+05:30 IST