కేంద్రం మళ్లీ నన్ను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుంది : మెహబూబా

ABN , First Publish Date - 2020-11-27T17:17:38+05:30 IST

కేంద్రంపై పీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరోసారి విరుచుకుపడ్డారు. తనను కేంద్రం మళ్లీ చట్ట విరుద్ధంగా

కేంద్రం మళ్లీ నన్ను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుంది : మెహబూబా

శ్రీనగర్ : కేంద్రంపై పీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరోసారి విరుచుకుపడ్డారు. తనను కేంద్రం మళ్లీ చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకుందని మండిపడ్డారు. అంతేకాకుండా తన కుమార్తె ఇల్తిజాను హౌజ్ అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కేంద్రం మళ్లీ నన్ను చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకుంది. పుల్వామాలో ఉంటుంన్న పారావహీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి రెండు రోజులుగా నిరాకరిస్తున్నారు. బీజేపీ, వారి తోలు బొమ్మలు రాష్ట్రంలో ప్రతి మూలనా తిరగడానికి అనుమతినిస్తున్నారు. నా విషయంలోనే కేంద్రానికి భద్రత గుర్తొస్తోంది.’’ అని మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు. పీడీపీ యువజన విభాగం అధ్యక్షుడు వహీద్ పర్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ నవీద్ బాబుతో సంబంధం ఉందంటూ టెర్రర్ కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. 

Read more