అంతర్రాష్ట్ర కదలికలపై నిషేధం విధించిన మేఘాలయ

ABN , First Publish Date - 2020-06-22T01:18:24+05:30 IST

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తున్న కర్ఫ్యూను ఈ నెల 30 వరకు పొడిస్తున్నట్టు మేఘాలయ

అంతర్రాష్ట్ర కదలికలపై నిషేధం విధించిన మేఘాలయ

షిల్లాంగ్:  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తున్న కర్ఫ్యూను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సోమవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే, ఈ నెలాఖరు వరకు అంతర్రాష్ట్ర కదలికలపైనా నిషేధం విధించినట్టు పేర్కొంది. అయితే, ఈ నిబంధనలు భద్రతా బలగాలు, వైద్య బృందాలు, హోల్‌సేల్, రిటైల్ ఫార్మసీలు, అత్యవసర సేవలకు వర్తించవని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-06-22T01:18:24+05:30 IST