కరోనా ఫ్లూ నిరోధక మందు... వైద్యునిపై కేసు నమోదు...

ABN , First Publish Date - 2020-03-19T22:34:41+05:30 IST

కరోనా వైరస్ నిరోధక మందు ఇస్తానని ప్రకటించిన ఓ వైద్యునిపై కేసు నమోదు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లా, బాసాయ్ సిటీకి ...

కరోనా ఫ్లూ నిరోధక మందు... వైద్యునిపై కేసు నమోదు...

ముంబై : కరోనా వైరస్ నిరోధక మందు ఇస్తానని ప్రకటించిన ఓ వైద్యునిపై కేసు నమోదు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లా, బాసాయ్ సిటీకి చెందిన డాక్టర్ సర్వర్ రాజే ఖాన్ ఆయుర్వేద వైద్యుడని, ఆయన క్లినిక్ బయట కరోనా వైరస్ ఫ్లూ వ్యాధి నిరోధక మందు ఇస్తానని బోర్డు పెట్టారని తెలిపారు. 


ఈ వైద్యుని ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నందు వల్ల ఐపీసీ సెక్షన్ 188, విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అధికారి ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు, వదంతులను వ్యాప్తి చేస్తున్నందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. 


కరోనా వైరస్ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు. 


Updated Date - 2020-03-19T22:34:41+05:30 IST