అక్టోబర్ 6-7న జపాస్ పర్యటనకు కేంద్ర మంత్రి జయశంకర్

ABN , First Publish Date - 2020-09-29T21:51:10+05:30 IST

అక్టోబర్ 6-7న జపాస్ పర్యటనకు కేంద్ర మంత్రి జయశంకర్

అక్టోబర్ 6-7న జపాస్ పర్యటనకు కేంద్ర మంత్రి జయశంకర్

న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అక్టోబర్ 6-7న జపాన్‌లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జపాన్ ప్రతినిధి తోషిమిత్సు మోతెగితో సమావేశం అవుతారు. అనంతరం క్వార్డిలేటరల్ సంకీర్ణం మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. తోషిమిత్సు మోతెగితో జపాన్-ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి జయశంకర్ మాట్లాడనున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.


‘‘ఈ పర్యటనలో, అక్టోబర్ 6న జరిగే రెండవ ఇండియా-ఆస్ట్రేలియా-జపాన్-యుఎస్ఎ మంత్రివర్గ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్‌తో పాటు ఆయా దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రాంతీయ సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇండో-పసిఫిక్ నిర్వహణ ప్రాముఖ్యతపై కూడా ప్రధానంగా చర్చించను్నారు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Updated Date - 2020-09-29T21:51:10+05:30 IST