సిబ్బంది నగ్న చిత్రాల సేకరణ: మాజీ సీఈవోపై మెక్‌డొనాల్డ్స్ ఫైర్!

ABN , First Publish Date - 2020-08-13T03:20:49+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్.. సంస్థ మాజీ సీఈవో స్టీవ్ ఈస్టర్‌బుక్‌పై షాకింగ్ ఆరోపణలు చేసింది.

సిబ్బంది నగ్న చిత్రాల సేకరణ: మాజీ సీఈవోపై మెక్‌డొనాల్డ్స్ ఫైర్!

లండన్: ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చైన్ మెక్‌డొనాల్డ్స్.. సంస్థ మాజీ సీఈవో స్టీవ్ ఈస్టర్‌బుక్‌పై షాకింగ్ ఆరోపణలు చేసింది. ఉద్యోగం లోంచి తొలగించే ముందు ఆఫీసులో ముగ్గురు యువతులతో అతను రాసలీలలు జరిపినట్లు తెలుస్తోంది. అంతటిలో ఆగకుండా ఆ యువతుల నగ్న చిత్రాలను అతను సేకరించినట్లు మెక్‌డొనాల్డ్స్ వెల్లడించింది. ఈ ఫొటోలను స్టీవ్ తన సొంత మెయిల్‌కు పంపుకున్నట్లు సమాచారం. దీనికోసం ఆఫీసు మెయిల్‌ను వాడుకున్నట్లు మెక్‌డొనాల్డ్స్ గుర్తించింది. ఆఫీసులో స్టీవ్ సాగించిన రాసలీలలు బయటపడటంతో ఆగ్రహించిన సంస్థ స్టీవ్‌పై కోర్టుకెక్కింది. అతను 42 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో పేర్కొంది.

Updated Date - 2020-08-13T03:20:49+05:30 IST