కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాయావతి తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2020-04-14T19:53:35+05:30 IST

శవ్యాప్త లాక్‌డౌన్ విధించిన తర్వాత వలస కూలీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాయావతి తీవ్ర విమర్శలు

లక్నో : దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన తర్వాత వలస కూలీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘‘కరోనా వైరస్ కారణంగా దళితుల, ఆదివాసీల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. అయినా సరే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మనస్తత్వం మాత్రం వారిపట్ల మారలేదన్నది స్పష్టమైంది’’ అని మండిపడ్డారు. వలస కూలీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు.


‘‘ఆయా రాష్ట్రాలు వలస కూలీలను పట్టించుకోని కారణంగా వారు బతకడానికి వారి వారి స్వస్థలాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.’’ అని దుయ్యబట్టారు. వలస కూలీల్లో అధిక శాతం దళితులు, ఆదివాసీలే ఉన్నారని, వారి వారి స్వస్థలాలకు వెళ్లకుండా ఆపేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయత్నించలేదని మండిపడ్డారు. కనీసం వలస కూలీల నిత్యావసరాలు తీర్చేందుకు కూడా ప్రయత్నించడం లేదని మాయావతి ఆరోపించారు. 

Updated Date - 2020-04-14T19:53:35+05:30 IST