జూన్ 8న తెరుచుకోనున్న మధుర, బృందావన ఆలయాలు!
ABN , First Publish Date - 2020-06-01T17:55:39+05:30 IST
రెండున్నర నెలల సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం యూపీలోని మధుర, బృందావనం దేవాలయాలు జూన్ 8 నుంచి భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. ప్రభుత్వం సూచించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుండి...
మధుర: రెండున్నర నెలల సుదీర్ఘ లాక్‌డౌన్ అనంతరం యూపీలోని మధుర, బృందావనం దేవాలయాలు జూన్ 8 నుంచి భక్తుల కోసం తెరుచుకోనున్నాయి. ప్రభుత్వం సూచించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుండి దేవాలయాలు తెరవనున్నారు. బ్రజ్‌లోని ప్రసిద్ధ ద్వారకాధిశ్ ఆలయ అధికారి రాకేశ్ తివారీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జూన్ 8 నుంచి ఆలయ తలుపులు తెరవనున్నాం. ఆలయానికి వచ్చే భక్తులు సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరించడం తప్పనిసరి అని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ బృందావనం అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సమయంలో అసంపూర్తిగా ఉన్న పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనులను దేవాలయాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూ. 12 కోట్ల వ్యయంతో బృందావన్ కుంజ్ వీధులలో భూగర్భ కేబులింగ్ జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా ఆలయ సుందరీకరణ పనులను రూ .38 కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు.