యానాగుంది క్షేత్రంలో మాత మాణికేశ్వరి కన్నుమూత
ABN , First Publish Date - 2020-03-08T04:05:56+05:30 IST
యానాగుంది క్షేత్రంలో మాత మాణికేశ్వరి(86) కన్నుమూశారు.
బెంగళూరు : యానాగుంది క్షేత్రంలో మాత మాణికేశ్వరి(86) కన్నుమూశారు. రేపు ఉదయం 10 గంటల నుంచి భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. మాణికేశ్వరి ఇక లేరన్న విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున క్షేత్రానికి తరలివస్తున్నారు. కాగా.. బుధవారం మాత మాణికేశ్వరి అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా.. గత నెలలో జరిగిన శివరాత్రి వేడుకల్లో మాణిక్యగిరి శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా మాతా మాణికేశ్వరి వేలాది భక్తులకు దర్శనం ఇచ్చారు. మాతా మాణికేశ్వరి నడవలేని స్థితిలో ఉండటంతో మాతా భక్తులు వీల్‌చేర్‌పై తీసుకొచ్చి భక్తులకు దర్శనం చేయించారు. మాతా మాణికేశ్వరి తెలంగాణలోని నారాయణపేట నుంచి 18 కిలో మీటర్ల దూరంలో, కర్ణాటక బార్డర్‌లోని మాణిక్యగిరి కొండ మీద కొలువుండేవారు.
