ప్రారంభమైన వైష్ణోదేవి యాత్ర
ABN , First Publish Date - 2020-08-16T15:57:10+05:30 IST
సుమారు ఐదు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఈ రోజు నుంచి వైష్ణో దేవి యాత్ర ప్రారంభమైంది. కరోనా భయాల నేపధ్యంలో ఈసారి వైష్ణోదేవి యాత్ర భిన్నంగా ఉండనుంది. భక్తులు మాస్కులు ధరించడంతోపాటు...

శ్రీనగర్: సుమారు ఐదు నెలల సుదీర్ఘ విరామం తరువాత ఈ రోజు నుంచి వైష్ణో దేవి యాత్ర ప్రారంభమైంది. కరోనా భయాల నేపధ్యంలో ఈసారి వైష్ణోదేవి యాత్ర భిన్నంగా ఉండనుంది. భక్తులు మాస్కులు ధరించడంతోపాటు, తమ కరోనా నెగిటివ్ రిపోర్టులు తీసుకురావాల్సివుంటుంది. అలాగే భక్తులువారి ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనితో పాటు యాత్ర జరిగే వివిధ ప్రదేశాలలో థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 18 న వైష్ణోదేవి యాత్ర నిలిపివేశారు. ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్టంగా రెండు వేల మంది యాత్రికులు వస్తారని మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్ కుమార్ తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే భక్తులను యాత్రకు అనుమతిస్తారని తెలిపారు. రాష్ట్రం వెలుపల నుంచి వచ్చే భక్తులకు కరోనా పరీక్షలు చేస్తారని, వారికి నెగిటివ్ రిపోర్టు వస్తేనే యాత్రకు అనుమతిస్తారని పేర్కొన్నారు.