పేరుకేమో మసాజ్‌ సెంటర్‌.. లోపలికెళితే మాత్రం..

ABN , First Publish Date - 2020-11-06T15:00:47+05:30 IST

నాగర్‌కోయిల్‌లో మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం చేయిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కన్నియకుమారి జిల్లాలో కొద్దిరోజులుగా మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నాగర్‌కోయిల్‌ సుంగాన్‌వీధిలో నడుస్తున్న మసాజ్‌ సెంటర్‌పై పోలీసులు

పేరుకేమో మసాజ్‌ సెంటర్‌.. లోపలికెళితే మాత్రం..

చెన్నై : నాగర్‌కోయిల్‌లో మసాజ్‌ సెంటర్‌ పేరుతో వ్యభిచారం చేయిస్తున్న దంపతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కన్నియకుమారి జిల్లాలో కొద్దిరోజులుగా మహిళలతో  వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో నాగర్‌కోయిల్‌ సుంగాన్‌వీధిలో నడుస్తున్న మసాజ్‌ సెంటర్‌పై పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మికంగా దాడులు చేశారు. కేరళ రాష్ట్రం కొల్లం ప్రాంతానికి చెందిన గోపాలకృష్ణన్‌ (56), రోజి (54) దంపతులు దుకాణం అద్దెకు తీసుకొని మసాజ్‌ సెంటర్‌ ప్రారంభించినట్టు, వ్యాపారం సరిగా లేకపోవడంతో మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో దంపతులను అరెస్ట్‌ చేసిన పోలీసులు, దుకాణంలో ఉన్న ఇద్దరు మహిళలను శరణాలయానికి తరలించారు. కాగా,  గోపాల కృష్ణన్‌ దంపతులు కళియంగాడు ప్రాంతంలో కొద్ది నెలల కిత్రం ఇదే విధంగా మసాజ్‌ సెంటర్‌ పేరిట వ్యభిచారం చేయిస్తుండడంతో ఆ ప్రాంత ప్రజలు వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారని పోలీసుల విచారణలో తెలిసింది.

Updated Date - 2020-11-06T15:00:47+05:30 IST