మాస్క్ ధరించనివారికి జరిమానా... వారంలో కోటి రూపాయలు వసూలు!

ABN , First Publish Date - 2020-09-13T15:54:13+05:30 IST

కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించే వారి విషయంలో పూణె పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

మాస్క్ ధరించనివారికి జరిమానా... వారంలో కోటి రూపాయలు వసూలు!

పూణె: కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు పాటించాల్సిన నియమాలను ఉల్లంఘించే వారి విషయంలో పూణె పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2 నుంచి సెప్టెంబరు 10 వరకూ మాస్క్ ధరించకుండా తిరుగుతున్న 27,989 మందికి రూ. 500 చొప్పున జరిమానా విధించారు. ఈ విధంగా  జరిమానాల రూపంలో మొత్తం 1,39,94,500 వసూలయ్యాయి. ఈ సందర్భంగా పూణె పోలీస్ డీసీపీ బచ్చన్ సింగ్ మాట్లాడుతూ పట్టణంలో మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్న వారి నుంచి వారం రోజల వ్యవధిలో కోటి రూపాయలకు పైగా మొత్తాన్ని వసూలు చేశామన్నారు. కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 22,084 కరోనా నమోదయ్యాయి.

Updated Date - 2020-09-13T15:54:13+05:30 IST