మాస్క్‌లు ధరించని వారి నుంచి ..

ABN , First Publish Date - 2020-05-09T13:40:21+05:30 IST

మాస్క్‌లు ధరించని వారి నుంచి ..

మాస్క్‌లు ధరించని వారి నుంచి ..

చెన్నై: ఈరోడ్‌లో మాస్క్‌లు ధరించకుండా తిరుగుతున్న వారి నుంచి రూ.2 లక్షల జరిమానా వసూలు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్‌ నిరోధక చర్యలను జిల్లా యంత్రాంగం, కార్పొరేషన్‌ సంయుక్తంగా చేపట్టాయి. అనవసరంగా ఇళ్లనుంచి బయటకు రావద్దని, అత్యవసర పనులు, దుకాణాలకు వచ్చే వారు మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మాస్క్‌ ధరించకుండా బయట తిరిగే వారు తొలిసారి పట్టుబడితే రూ.100, రెండోసారి పట్టుబడితే రూ.500, మూడోసారి పట్టుబడితే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు మాస్క్‌లు ధరించకుండా బయట తిరుగుతున్న 2 వేలమంది నుంచి రూ.2 లక్షల జరిమానా వసూలు చేసినట్లు ఈరోడ్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎం.ఇళంగోవన్‌ తెలిపారు.

Updated Date - 2020-05-09T13:40:21+05:30 IST