ఇన్‌ఫార్మర్ నెపంతో నలుగుర్ని చంపేసిన మావోయిస్టులు

ABN , First Publish Date - 2020-09-06T15:50:33+05:30 IST

ఇన్ఫార్మర్ నెపంతో బస్తర్ లోని నలుగుర్ని మావోయిస్టులు చంపేశారని పోలీసులు వెల్లడించారు. బస్తర్‌లోని

ఇన్‌ఫార్మర్ నెపంతో నలుగుర్ని చంపేసిన మావోయిస్టులు

చత్తీస్‌గఢ్ : ఇన్ఫార్మర్ నెపంతో బస్తర్ లోని నలుగుర్ని మావోయిస్టులు చంపేశారని పోలీసులు వెల్లడించారు. బస్తర్‌లోని దుమ్రీ- పాల్నర్ జిల్లాలో గత రెండు రోజులుగా నక్సల్స్ నలుగుర్ని చంపేశారని తెలిపారు. డుమ్రీ- పాల్నర్ ప్రాంతంలోని చుట్టు పక్కల గ్రామాల ప్రజలని నక్సల్స్ పిలిచారని, అభివృద్ధి పనులకు మద్దతిచ్చే ప్రజలను ఇన్‌ఫార్మర్ నెపంతో క్రూరంగా చంపేసినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.


అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతు పలకడంతోనే నక్సల్స్ ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారని గ్రామస్థులు మండిపడ్డారు. నలుగుర్ని చంపడమే కాకుండా గ్రామస్థులను కొందర్ని క్రూరంగా కొట్టారని పోలీసులు వెల్లడించారు. అయితే నలుగుర్నీ ఒకేసారి చంపేశారా? ఇద్దరి చొప్పున చంపేశారా? అన్నది ఇంకా తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-09-06T15:50:33+05:30 IST