గ్రామస్థులను కొట్టిన మావోయిస్టులు

ABN , First Publish Date - 2020-07-20T08:11:02+05:30 IST

గ్రామాభివృద్ధిని వ్యతిరేకిస్తూ గ్రామస్థులను మావోయిస్టులు చితకబాదారు. ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లా పర్చేలి గ్రామంలో ఎస్పీ అభిషేక్‌ పల్లవ చొరవతో ఇటీవలే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు...

గ్రామస్థులను కొట్టిన మావోయిస్టులు

రాయ్‌పూర్‌, జూలై 19: గ్రామాభివృద్ధిని వ్యతిరేకిస్తూ గ్రామస్థులను మావోయిస్టులు చితకబాదారు. ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లా పర్చేలి గ్రామంలో ఎస్పీ అభిషేక్‌ పల్లవ చొరవతో ఇటీవలే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. 10-15మంది సాయుధ మావోయిస్టులు ఆ గ్రామంలో రాత్రివేళ పంచాయతీ నిర్వహించి, మహిళలు, పిల్లలతో సహా 25మందిని దారుణంగా కొట్టారని ఎస్పీ తెలిపారు. చెప్పారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారని, 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.


Updated Date - 2020-07-20T08:11:02+05:30 IST