రావణ దర్బారులో బీజేపీ ఎంపీ మనోజ్ తివారి!

ABN , First Publish Date - 2020-10-24T11:54:44+05:30 IST

యూపీలోని అయోధ్యలో సరయూ తీరంలో జరుగుతున్న రామలీల కార్యక్రమంలో రావణుడు- అంగదుని సంభాషణ ప్రేక్షకులను...

రావణ దర్బారులో బీజేపీ ఎంపీ మనోజ్ తివారి!

అయోధ్య: యూపీలోని అయోధ్యలో సరయూ తీరంలో జరుగుతున్న రామలీల కార్యక్రమంలో రావణుడు- అంగదుని సంభాషణ ప్రేక్షకులను అమితంగా ఆకట్టకుంది. అంగదుని పాత్రలో ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారి కనిపించడం మరింత ఆసక్తికరంగా మారింది. అంగదునిగా మనోజ్ తివారి పలికించిన డైలాగులు ప్రేక్షకులను అమితంగా అలరించాయి. 


అయోధ్యలో 9 రోజుల పాటు రామలీల కార్యక్రమం జరుగుతోంది. దీనిని దూరదర్శన్ ప్రసారం చేస్తోంది. మనోజ్ తివారితో పాటు ఈ ప్రదర్శనలో పలువురు ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ రామలీల కార్యక్రమంలో భరతుని పాత్రలో కనిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేముందు మనోజ్ తివారి మాట్లాడుతూ యూపీ ప్రభుత్వం అయోధ్య అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తున్నదని అన్నారు. 


Updated Date - 2020-10-24T11:54:44+05:30 IST